ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం క్యారెట్ కోవా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే క్యారెట్ కోవా లడ్డు మీ సొంతం.
క్యారెట్ కోవా లడ్డు కి కావలసిన పదార్ధాలు:
కోవా -1/4 కేజీ
క్యారెట్ - 4
కొబ్బరి తురుము - 1/2 కప్పు
పంచదార - 1/2 కప్పు
నెయ్యి - 4 స్పూన్స్
జీడిపప్పు - సరిపడ
బాదంపప్పు - సరిపడ
ద్రాక్ష - సరిపడ
యాలకులపొడి - 1 స్పూన్
క్యారెట్ కోవా లడ్డు తయారు చేసే విధానం:
ముందుగా క్యారెట్ ని తురుము కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు, ద్రాక్షని వేయించి పక్కకు తీసి అందులో క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తరువాత ఇందులో కొబ్బరితురుము, పంచదార వేసి బాగా కలిపి దగ్గరయ్యే వరకు తిప్పుతూ ఉండాలి.
ఇప్పుడు జీడిపప్పు, బాదంపప్పు, ద్రాక్ష, యాలకుల పొడి వేసి అన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కోవాని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అర చేతిలో పరుచుకుని మద్యలో క్యారెట్ మిశ్రమాన్ని పెట్టి కోవతో అన్ని వైపులా ముసి లడ్డులగా చుట్టుకోవాలి. అంతే చిటికెలో క్యారెట్ కోవా లడ్డు తయారు.