ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం క్యారెట్ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే క్యారెట్ ఊతప్పం మీ సొంతం.
క్యారెట్ ఊతప్పం కి కావలసిన పదార్ధాలు:
బియ్యం - 2 కప్పు
మినప్పప్పు - 1 కప్పు
మెంతులు - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
సోడాఉప్పు - చిటికెడు
పచ్చిమిర్చి ముక్కలు - 2 స్పూన్
ఉల్లిపాయ -ఒకటి
క్యారెట్ తురుము - 1/2 కప్పు
టొమోటో - 1
కొత్తిమీర - సరిపడ
క్యారెట్ ఊతప్పం తయారు చేసే విధానం:
ముందుగా బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి నీటిలో సుమారు 8 గంటలపాటు నానబెట్టుకోవాలి. రాత్రికి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. మరు నాడు ఉదయం పులిసిన పిండిలో కొద్దిగా నీళ్ళు, ఉప్పు, సోడాఉప్పు వేసి చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం వేడి చేసి ఉల్లిపాయ ముక్కతో పెనమంతా రుద్దాలి. ఇప్పుడు గరిటెతో పిండిని తీసుకోని మందంగా వేయాలి. పైన నూనె ఊతప్పం చుట్టూ వేయాలి.
ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి సిమ్‌లో 5 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత ఊతప్పంను ప్లేటులోకి మెల్లిగా తీయాలి. అంతే క్యారెట్ ఊతప్పం తయార్. ఇది వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.