కావలసిన పదార్ధాలు:
అర కప్పు పెరుగు, ఒక టీ స్పూన్ ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, నూనె 2 టేబుల్ స్పూన్, అర కప్పు ఆవపిండి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక ఆరెంజ్ తొక్క తీసినది, అర కప్పు మీగడ, తరిగిన క్యారట్లు రెండు.
తయారు చేసే విధానం:
తరిగిన క్యారట్ ముక్కలను ఒక గంట సేపు చల్లని నీటిలో నానబెట్టాలి. తరువాత కమలాపండు తొక్క తీసి ముక్కలను వేరు చేయాలి. తరువాత నిమ్మరసం, మిరియాల పొడి, మీగడ, పెరుగు, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. తరువాత ఒక అర గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లపరిస్తే చాలు.అంతే క్యారట్ ఆరెంజ్ సలాడ్ రెడీ.