ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం క్యాబేజీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే క్యాబేజీ పులావ్ మీ సొంతం.
క్యాబేజీ పులావ్ కి కావలసిన పదార్ధాలు:
బాస్మతి రైస్- 1/4 కేజీ
క్యాప్సికమ్- 1
క్యాబేజీ తురుము - 1కప్పు
ఉల్లిపాయ ముక్కలు -1/2 కప్పు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్స్
పచ్చిమిర్చి పేస్ట్- 2 స్పూన్స్
గరం మసాల - 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
నూనె -1/2 కప్పు
క్యాబేజీ పులావ్ తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయంచాలి, అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా నూనెలో వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, క్యాప్సికమ్ దోరగా వేగాక, క్యాబేజీ ముక్కల్ని కూడా అందులో చేర్చాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చిపేస్ట్‌ను కలపాలి.
తరువాత మిశ్రమంలో బియ్యాన్ని ఒకసారి కడిగి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులో మూడు కప్పుల నీళ్ళు, సరిపడ ఉప్పు వేసి చిన్న మంట మీద ఉడక నివ్వాలి. అన్నం బాగా పదునుగా అయిన తరువాత దింపుకోవాలి. ఓ ప్లేటులోకి తీసుకుని కొత్తిమీర, టమోటా సాస్‌లలో వేడివేడిగా సర్వ్ చేయండి.