ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం క్యాబేజి కోఫ్తా బాల్స్ కర్రి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే క్యాబేజి కోఫ్తా బాల్స్ కర్రి మీ సొంతం.
క్యాబేజి కోఫ్తా బాల్స్ కర్రి కి కావలసిన పదార్ధాలు:
క్యాబేజి తురుము - 1 కప్పు
శనగపిండి -1 కప్పు
అల్లం - ఒక ముక్క
జిలకర్ర - 1 స్పూన్
ఆయిల్ - తగినంత
కారం - 2 స్పూన్
గరం మసాలా - 1 స్పూన్
జీడిపప్పు - 10 పేస్ట్ 1 కప్పు
ఉల్లిపాయలు పేస్ట్ -1 కప్పు
టమాటాలు పేస్ట్ -1 కప్పు
ఉప్పు - సరిపడ
కొత్తిమీర - సరిపడ
క్యాబేజి కోఫ్తా బాల్స్ కర్రి తయారు చేసే విధానం:
ముందుగ ఒక గిన్నెలోనికి క్యాబేజీ తురుము, ఉప్పు, రెండు స్పూన్ల కారం, అరస్పూన్ గరం మసాలా, ఒక కప్పు శనగపిండి వేసి కొద్దిగా వాటర్ కలిపి అన్నింటిని బాగా కలిపి మొత్తం మిశ్రమాన్ని బాల్స్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ పై పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకు సరిపడ ఆయిల్ పోసి కాగాక తయారు చేసి పెట్టుకొన్న క్యాబేజి బాల్స్ ను అందులో వేసి ఎర్రగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
మరొక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆయిల్ లో వేయించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు అందులో వేయాలి కొద్దిగా వేగాక, టమోటో పేస్ట్, అల్లం పేస్ట్, జిలకర్ర, కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, కొతిమిర, వేసి బాగా వేగాక కొద్దిగా వాటర్ జతచేసి మూతపెట్టాలి. ఈ మిశ్రమం 5 నిమిషాలు ఉడికిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా కలపాలి తర్వాత ముందుగా తయారు చేసుకొన్న క్యాబేజి బాల్స్ ని అందులో వేసి దింపుకోవాలి అంతే కొత్తిమిర గార్నిష్ చేసుకుంటే క్యాబేజి కోఫ్తా బాల్స్ రెడీ.