ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కోడి గుడ్డు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కోడి గుడ్డు కుర్మా మీ సొంతం.
కోడి గుడ్డు కుర్మా కి కావలసిన పదార్ధాలు:
కోడిగుడ్లు - నాలుగు
ఉల్లిపాయలు - 2
టమాటో - 2
జీలకర్ర - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ధనియాలు - 2 స్పూన్
గరం మసాల-1 స్పూన్
కొబ్బరి - కొద్దిగా
నూనె - సరిపడ
ఉప్పు - సరిపడ
కోడి గుడ్డు కుర్మా తయారు చేసే విధానం:
ముందుగా కోడిగుడ్లులను ఉడికించి పక్కన పెట్టు కోవాలి. తరువాత ఉల్లిపాయలు, టమాటోలను విడి విడిగా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ధనియాలు, కొబ్బరి, గరం మసాల, కలిపి ముద్దగా రుబ్బుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలి పెట్టి అందులో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ పేస్టు వేసి రంగు మారేదాకా వేయించాలి.
తరువాత అందులోనే టమాటో పేస్ట్ కూడా వేసి మరో రెండు నిమిషాల తరువాత మసాల ముద్ద వేసి సరిపడ నీళ్ళు, ఉప్పు, కారం, పసుపు, వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. తరువాత ఈ మిశ్రమం ఉడుకుతుండగా అందులో ఉడికించిన కోడిగుడ్లు వేసి మూతపెట్టి సన్నటి సెగపై ఉడికించాలి. కూర దగ్గరవుతుండగా, పైన కొత్తిమీర చల్లి అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే రుచికరమైన ఎగ్ కుర్మా తయార్.