ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కోకోబార్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కోకోబార్ మీ సొంతం.
కోకోబార్ కి కావలసిన పదార్ధాలు:
పచ్చికొబ్బరి తురుము - 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 3/4 కప్పు
కాచిచల్లార్చిన పాలు -2 కప్పులు
ఫుడ్ కలర్ - కొద్దిగ
కోకోనట్ఎసెన్స్ - 1 1/4 స్పూన్
కోకోబార్ తయారు చేసే విధానం:
ముందుగా కొబ్బరి తురుముని ఒక గిన్నెలోకి తీసుకోని అందులో పాలు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ వేసి స్టవ్ మీద పెట్టి గట్టి పడేవరకూ కలుపుతూ ఉడికించాలి. అడుగు అంటకుండా చిన్న మంట పై నీళ్ళన్ని ఆవిరి అయ్యే వరకు వుడకనిచ్చి అందులో పంచదారని పోయాలి. ఇప్పుడు పంచదార కరిగి ఈ మిశ్రమం తిరిగి పలచబడుతుంది. తరువాత మరల గట్టి పడే వరకూ ఉంచి ఎసెన్స్, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి దించాలి.
ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా చేసుకోవాలి. చల్లారిన తరువాత చాకుతో పొడవుగా అంగుళం వెడల్పుగా ముక్కలు కట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కోకోబార్ తయార్. వీటిని రంగుకాగితంలో చుట్టి పిల్లలకు యీస్తే చాలా ఇష్టంగా తింటారు.