ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కోకోనట్ బర్ఫీ మీ సొంతం.
కోకోనట్ బర్ఫీ కి కావలసిన పదార్ధాలు:
పచ్చికొబ్బరితురుము - 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
మీగడ -1 కప్పు
నెయ్యి - 4 స్పూన్స్
శనగపిండి - 2 స్పూన్స్
జీడిపప్పుముక్కలు-2 స్పూన్స్
కోకోనట్ బర్ఫీ తయారు చేసే విధానం:
ముందుగ మందపాటి గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పుముక్కలుని వేయించి పక్కకు తీసుకోవాలి. శనగపిండిని కూడా దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి.
తరువాత అదే గిన్నెలో కొబ్బరి తురుము, పంచదార, మీగడ వేసి చిన్న మంట పై ఉడకనివ్వాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పాకం గట్టి పడి ముద్దలాగా తయారై అంచులు వదులుతున్నప్పుడు. ముందుగ నెయ్యి రాసి పెట్టిన ప్లేటులో పోయాలి. ఇప్పుడు దానిని ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పుముక్కలు అలంకరించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కోకోనట్ బర్ఫీ తయార్.