ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కొబ్బరి సమోసా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కొబ్బరి సమోసా మీ సొంతం.
కొబ్బరి సమోసా కి కావలసిన పదార్ధాలు:
మైదా పిండి - 2 కప్పులు
నెయ్యి- 4 స్పూన్స్
వాము-2 స్పూన్స్
ఉప్పు - సరిపడ
నూనె - తగినంత
సమోసాల్లో నింపేందుకు
కొబ్బరితురుము - 2 కప్పులు
నువ్వులు - 1/2 కప్పు
కారం- 2 స్పూన్స్
ధనియాలపొడి- 2 స్పూన్స్
సోంపు-2 స్పూన్స్
ఇంగువ- 1/2 స్పూన్
కొబ్బరి సమోసా తయారు చేసే విధానం:
ముందుగా మైదా పిండిలో వాము, కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి కొబ్బరి తురుము, నువ్వులను విడి విడిగా వేయించి పక్కన ఉంచాలి. నువ్వులు చల్లారిన తరువాత పొడిచేసి ఉంచాలి. ఇప్పుడు నువ్వులపొడి, కొబ్బరి తురుము, సోంపు, వాము, ధనియాలపొడి, ఇంగువ, కారంపొడిలను ఒక పాత్రలో వేసి బాగా కలియబెట్టాలి.
తరువాత మైదాను చిన్న చిన్న పూరీల్లా చేసి చాకుతో రెండు భాగాలుగా కోయాలి. ఒక్కోదాంట్లో పొడి మిశ్రమాన్ని మూడు స్పూన్లు వేసి నీటితో తడుపుతూ చివర్లు సమోసా షేప్‌లో మూసివేయాలి. అలా మొత్తం పిండినంతా చేసుకుని బాగా కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసి న్యూస్ పేపర్‌పై పరవాలి. అంతే వేడి వేడి కొబ్బరి సమోసాలు తయార్. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్‌తో కలిపి తింటే రుచిగా ఉంటాయి.