ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కొబ్బరి బొబ్బట్లు మీ సొంతం.
కొబ్బరి బొబ్బట్లు కి కావలసిన పదార్ధాలు:
పచ్చికొబ్బరి తురుము -2కప్పులు ,
బెల్లం లేదా పంచదార - 1కప్పు
నూనె - సరిపడ
మైదా - 1/4 కేజీ
యాలకుల పొడి - 1/4 స్పూన్
నెయ్యి - కొంచం
కొబ్బరి బొబ్బట్లు తయారు చేసే విధానం:
ముందుగ మైదాను నూనె, నీళ్ళు కలిపి రెండు పాటు నానబెట్టాలి. తరువాత పచ్చికొబ్బరి తురుము, బెల్లం లేదా పంచదార కొంచం నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి. గట్టి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం గట్టి పడిన తరువాత యాలకుల పొడి కలిపి దించి పక్కన పెట్టుకోవాలి.
చల్లరినక మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాకం ముద్దని చిన్న ఉండలుగా చేసి మైదాను కొద్ది కొద్దిగా తీసుకుంటూ అందులో ఉండాలని పెట్టి ఆకు పైన నెయ్యి రాసి బొబ్బట్లులగా వత్తి పెనం పైన వేసి రెండు వైపులా నెయ్యి రాసి బాగా కాల్చుకోవాలి. ఎంతో రుచిగా ఉండే వేడి వేడి కొబ్బరి బొబ్బట్లు తయార్.
గమనిక : తడి తగలకుండా ఉంటే రెండు, మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి.