ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కొబ్బరి పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కొబ్బరి పాయసం మీ సొంతం.
కొబ్బరి పాయసం కి కావలసిన పదార్ధాలు:
కొబ్బరి కాయ - ఒకటి
పాలు - లీటరు
పంచదార - 1/4 కేజీ
యాలకుల పొడి - 1/2 స్పూన్
కిస్‌మిస్ - 1 స్పూన్
జీడిపప్పు -కొద్దిగా
నెయ్యి - 1 స్పూన్
కొబ్బరి పాయసం తయారు చేసే విధానం:
బాణలో నేయి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి తీయాలి. కొబ్బరి తురమాలి మందం గల గిన్నెలో పాలు కాగ పెట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి.
పంచదార కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి బాగా మరగించాలి. ఆ తర్వాత యాలకుల పొడి, ముందుగ వేయించిన కిస్‌మిస్ జీడిపప్పు వేసి బాగా కలుపుకొని దింపుకోవాలి.అంతే ఎంతో రుచిగా ఉండే పాయసం రేడి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.