కావలసిన పదార్ధాలు:
1 గ్లాస్ తురిమిన పచ్చి కొబ్బరి, 1 గ్లాస్ వేగించిన శనగ పప్పు పిండి, 1 1 /2 గ్లాస్ పంచదార, కొద్దిగా నెయ్యీ,1 స్పూన్ యలుక పొడి.
తయారు చేసే విధానం:
స్టవ్ మీద ఒక మందపాటి కళాయీ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. దీనిలో పంచదార పోసి కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా తక్కువ మంట పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా తీగ పాకం వచ్చే అంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఎట్లా తెలుస్తది అంటే చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకొని దానిలో కరిగిన పాకాన్ని వేసి చేతి వేళ్ళతో పట్టుకుంటే జిగురుగా ,అంటుకున్నాటుగా అనిపిస్తుంది. అంతే దానిలోకి కొబ్బరి తురుము వేసి 5 నిముషాలు కలపాలి. తరువాత స్టవ్ ఆపేసి పప్పు పిండి కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి.దీనిలోనే 1 స్పూన్ యలుక పొడి వేసి బాగా కలిపాలి. ఒక ప్లేటులో కొద్దిగా నెయ్యీ వేసి ప్లేట్ మొత్తం కలిసే తట్ట్లుగా బాగా రుద్దాలి.ఈ ప్లేట్ లో తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసి గట్టి పడిన తరువాత ముక్కలు కోసుకుంటే సరి. పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి పప్పు చెక్క తినడానికి రెడీ.