ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కొబ్బరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కొబ్బరి కుడుములు మీ సొంతం.
కొబ్బరి కుడుములు కి కావలసిన పదార్ధాలు:
బియ్యం రవ్వ - 2 కప్పులు
పచ్చికొబ్బరి తురుము - 2 కప్పు
పచ్చి శనగపప్పు - 1/2 కప్పు
ఉప్పు - సరిపడ
నెయ్యి - 2 స్పూన్
నీళ్లు - 4 కప్పులు
కొబ్బరి కుడుములు తయారు చేసే విధానం:
ముందుగా పచ్చి శనగపప్పుని కుక్కర్ లో వేసి బాగా ఉడికించుకోవాలి. తరువాత ఓ గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి సరిపడ ఉప్పు వేసి ఆ తరువాత బియ్యం రవ్వ వేయాలి. అది బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి.
తరువాత పచ్చికొబ్బరి తరుము, ఉడికించిన శనగపప్పు వేసి బాగా కలిపి నెయ్యి వేసి దింపేయాలి. వేడి
చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని మళ్లీ ఐదు నిమిషాలు పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే గణపతి కి ఎంతో ఇష్టమైన కొబ్బరి కుడుములు రేడి