ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కొబ్బరి ఉండలు మీ సొంతం.
కొబ్బరి ఉండలు కి కావలసిన పదార్ధాలు:
పచ్చికొబ్బరితురుము - 6 కప్పులు
శనగపిండి - 2 కప్పులు
బెల్లం - 4 కప్పులు
బియ్యపుపిండి - 2 కప్పులు
యాలకులపొడి - కొంచం
నూనె - 1/2 కేజీ
నెయ్యి - 2 స్పూన్స్
జీడిపప్పు,ద్రాక్ష - కొంచం
కొబ్బరి ఉండలు తయారు చేసే విధానం:
నెయ్యిలో జీడిపప్పు, ద్రాక్ష వేయించాలి. తరువాత ముందుగ మందపాటి గిన్నెలో బెల్లం, కొబ్బరితురుము కలిపి సన్నని మంట పై ఉడికించి పాకం రానివ్వాలి. ఇప్పుడు వేయించినజీడిపప్పు, ద్రాక్ష,వేసి యాలకులపొడి దింపుకోవాలి. చల్లారిన తరువాత చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు శనగపిండి, బియ్యపుపిండిని నీళ్ళు కలిపి పలచగా చేయాలి. బాణలిలో నూనె పోసి కగిక ఇందాక తయరు చేసుకున్న ఉండాలని పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించి తీసుకోవాలి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే కొబ్బరి ఉండలు సిద్దం.