ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కేబేజీ పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కేబేజీ పప్పు మీ సొంతం.
కేబేజీ పప్పు కి కావలసిన పదార్ధాలు:
ఒక కప్పు కందులు, 3/4 తరిగిన కేబేజీ, 3 వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ తరిగిన పచ్చి మిరపకాయలు, 1/2 స్పాన్ పసుపు, 1 చింతపండు పేస్టు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ నూనె, 2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 4 ఎండు మిరపకాయలు.
కేబేజీ పప్పు తయారు చేసే విధానం:
ముందుగా కందులను కడిగి, అందులో ఒక కప్పు నీళ్ళు, తరిగిన కేబేజీ, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, చింతపండు పేస్టు వేసి పది నిమషాల పాటు ప్రేస్స్యుర్ కుక్కర్ లో వండాలి. తరువాత ఉప్పు వేసి గుజ్జు లాగా చేయాలి. ఆ తరువాత ఒక కడాయిలో నూనె పోసి తరిగిన వెల్లుల్లి వేసి ఏర్ర రంగు వచ్చే వరకి వేయించాలి, తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి మినపప్పు ఎర్రగా అయ్యే వరకి వండాలి. ఎండు మిర్చిని వేయించి పప్పు లో కలిపి వేయాలి. అంతే రుచికరమైన కేబేజీ పప్పు తయ్యార్.