Home » Telugu Recipes » Homemade కాకరకాయ వేపుడు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

కాకరకాయ వేపుడు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కాకరకాయ వేపుడు మీ సొంతం.

కాకరకాయ వేపుడు కి కావలసిన పదార్ధాలు:

కాకరకాయలు - 1/4 కేజీ
ఉల్లిపాయలు - 2
కారం - 1స్పూన్
నూనె - 4 స్పూన్స్
ఉప్పు - సరిపడ
పంచదార - 1 స్పూన్

కాకరకాయ వేపుడు తయారు చేసే విధానం:

ముందుగా కాకరకాయలను నీటితో శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె పోసి, కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ముక్కలు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించాలి.
తరువాత ఆ ముక్కలకు కారం, ఉప్పు, పసుపు, వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత చివరగా పంచదార వేసి కలిపి దింపుకోవాలి. అంతే కాకరకాయ వేపుడు రేడి.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com