ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కర్బూజా రసగుల్ల ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కర్బూజా రసగుల్ల మీ సొంతం.
కర్బూజా రసగుల్ల కి కావలసిన పదార్ధాలు:
కర్బూజా పండు - 1/2
పాలు - 3/4 లీ
నెయ్యి -100 గ్రా
పంచదార - 150 గ్రా
కార్న్ ఫోర్- 25 గ్రా
నిమ్మకాయ -1
కర్బూజా రసగుల్ల తయారు చేసే విధానం:
ముందుగా చక్కెరలో సరిపడినన్ని నీళ్ళుపోసి కలిపి స్టవ్ మీద పెట్టి తీగ పాకం తయారుచేయాలి. తరువాత కర్బూజాని ముక్కలుగా చేసి మిక్సి చేసి జ్యూస్ తయారు చేసుకొని పాకము చల్లారిన తరువాత అందులో ఈ జ్యూస్ కలుపుకోవాలి. ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టి అందులో నిమ్మకాయ పిండి పాలు విరిగేలా చెయ్యాలి. తరువాత విరిగిన పాలను పల్చటి గుడ్డలో వేసి వడకట్టి పన్నీర్ తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పన్నీర్ ని చేత్తో మెత్తగా నలిపి కార్న్ ఫోర్ కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత బాణలిలో నెయ్యి పోసి కాగాక ఈ పన్నీర్ ఉండలను వేసి సన్నని మంటపై దోరగా వేయించి తీసి ఇందాక తయారు చేసుకున్న కర్బూజా జ్యూస్ లో వేసి 2 గంటలు నానవ్వాలి. అంతే రుచికరమైన కర్బూజా రసగుల్ల తయార్.