Home » Telugu Recipes » Homemade కద్దు ఖీర్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

కద్దు ఖీర్


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కద్దు ఖీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కద్దు ఖీర్ మీ సొంతం.

కద్దు ఖీర్ కి కావలసిన పదార్ధాలు:

సొరకాయ- 1 పెద్దది
పాలు - 2 లీటర్లు
బాస్మతి బియ్యం - 150 గ్రా
కార్న్‌ఫ్లోర్- 200 గ్రా
కోవా - 1/2 కేజీ
పంచదార- 1 కేజీ
మిల్క్‌మెయిడ్ క్రీం- 250 గ్రా
నెయ్యి - 250 గ్రా
జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష- 100 గ్రా
గ్రీన్ ఫుడ్‌కలర్- కొద్దిగా

కద్దు ఖీర్ తయారు చేసే విధానం:

ముందుగా బాస్మతి బియ్యాన్ని కొద్దిగా నెయ్యిలో వేయించి, పిండి చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక పాత్రలో పాలు పోసి అవి మరుగుతుండగా, బియ్యంపిండికి కొద్దిగా నీళ్ళు కలిపి పేస్టులా చేసి గరిటెతో కలుపుతూ పాలల్లో పోయాలి. అలాగే కార్న్‌ఫ్లోర్ ని కూడా పేస్టులా చేసి అందులో పోయాలి. దాంతోపాటు సొరకాయ తురుమును కూడా కాస్త ఉడికించి ఆ తరువాత వేయాలి.
తరువాత పంచదార పోసి చల్లారిన తరువాత కోవా, మిల్క్‌మెయిడ్, నెయ్యి, ఫుడ్ కలర్ వేసి బాగా కలియబెట్టాలి. చివరగా నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను అందులో వేసి దింపుకోవాలి. ఈ మిశ్రమం కాస్త చలబడిన తరువాత 30 నిముషాలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతే కద్దూ ఖీర్ తయార్.
గమనిక : ఇది వారం, పదిరోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తీసుకోవచ్చు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com