ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కంద బచ్చలి కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కంద బచ్చలి కూర మీ సొంతం.
కంద బచ్చలి కూర కి కావలసిన పదార్ధాలు:
కంద -1/2 కేజీ,
బచ్చలి కూర -నాలుగు కట్టలు
చింతపండుగుజ్జు -1స్పూన్
బెల్లంతురుము - 1స్పూన్
ఆవాలు -1స్పూన్
ఎండుమిర్చి - 2
ఉప్పు -సరిపడ
సెనగపప్పు -2స్పూన్స్
మినప్పప్పు -2 స్పూన్స్
పచ్చిమిర్చి -3
అల్లంతురుము -1స్పూన్
జీలకర్ర -2స్పూన్స్
పసుపు -1స్పూన్
ఇంగువ -చిటికెడు
నూనె -సరిపడ
కంద బచ్చలి కూర తయారు చేసే విధానం:
ముందుగ కంద తొక్కు తీసి ముక్కలుగా కోసి నీళ్ళలో వేయాలి. ఈ ముక్కల్లో ఉప్పు, బెల్లం, పసుపు, చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. బచ్చలి కూర కూడా సన్నగా తరిగి పక్కన ఉంచాలి. ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, కలిపి మెత్తగా నూరాలి.
మందపాటి బాణలి తీసుకుని నూనె వేసి కాగనివ్వాలి. తరువాత సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లంతురుము, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత సన్నగా తరిగిన బచ్చలి కూర కూడా వేసి ఉడికించాలి. అది మెత్తగా ఉడికిన తరువాత ఉడికించిన కంద ముక్కలు వేసి మరో పది నిముషాలు సిమ్ లో ఉడికించి, ఇప్పుడు ఇందాక నూరిన ఆవముద్ద వేసి కలిపి దింపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కంద బచ్చలి కూర తయార్.