ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఎగ్ ఫుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఎగ్ ఫుడ్డింగ్ మీ సొంతం.
ఎగ్ ఫుడ్డింగ్ కి కావలసిన పదార్ధాలు:
ఎగ్స్ - 6
పాలు - 1 లీటరు
పంచదార - 250 గ్రా
యాలకుల పొడి - 1/2 స్పూన్
జీడిపప్పు, కిస్ మిస్ - కొద్దిగా
నెయ్యి - 2 స్పూన్స్
ఎగ్ ఫుడ్డింగ్ తయారు చేసే విధానం:
ముందుగా ఎగ్స్ ని ఒక గిన్నెలో వేసి బాగా బీట్ చేసుకోవాలి. లోతైన గిన్నెలో నెయ్యి వేసి వేడి అయిన తరువాత జీడిపప్పు, కిస్ మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించుకోవాలి. మరిగించిన పాలల్లో పంచదార కలిపి చల్లారిన తరువాత అందులో బీట్ చేసిన ఎగ్స్, యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని జీడిపప్పు, కిస్ మిస్ ఉన్న గిన్నెలో పోయాలి.
ఫ్రెషర్ కుక్కర్ లో ఒక గ్లాసు నీరు పోసి దానిలో ఈ మిశ్రమ గిన్నెను ఉంచి మూతపెట్టి విజిల్ పెట్టకూడదు. బాగా ఆవిరి వచ్చేటప్పుడు స్టవ్ ని సిమ్ లో ఒక పదినిమిషాలు ఉంచి స్టవ్ ని ఆఫ్ చెయ్యాలి. ఇది చూడడానికి జున్నులా ఉంటుంది. దీన్ని వేరే గిన్నేలోకి వంచి బాగా చల్లారనిచ్చి ఫ్రిజ్ లో పెట్టి తినవచ్చు.