ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం మీ సొంతం.
ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం కి కావలసిన పదార్ధాలు:
బొంబాయిరవ్వ- 1 కప్పు
బియ్యంపిండి - 2 కప్పులు
గుడ్లు - 2
పెరుగు - 1 కప్పు
ఉల్లిపాయ- 1
పచ్చిమిర్చి -3
క్యారెట్ - 1
టమాట- 1
కొత్తిమీర- 1/2 కప్పు
అల్లం తురుము - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
మిరియాలపొడి - 1 స్పూన్
వంటసోడా - 1/2 స్పూన్
నూనె - సరిపడ
ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం తయారు చేసే విధానం:
ముందుగా బొంబాయిరవ్వ, బియ్యంపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పెరుగు, ఉప్పు వంటసోడా వేసి తగినన్ని నీళ్ళతో జారుగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. తరువాత ఉల్లి, మిర్చి, టమాట. అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్ని చాల సన్నగా తరిగి ఉంచుకోవాలి. కారట్ తురుముకోవాలి. ఇప్పుడు గుడ్లను ఒక బౌల్ లోకి బ్రేక్ చేసి ఉప్పు, మిరియాలపొడి వేసి బీట్ చెయ్యాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడి చేసి కొంచెం పిండిని దోశలాగ వేయాలి.
ఊతప్పం కనుక కొంచెం మందంగా ఉన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు పైన తరిగిన ఉల్లి మిశ్రమాన్ని వేయాలి. చివరగా బీట్ చేసిన ఎగ్ కూడా వేసి నూనె వేయాలి. కొంచెం ఉడికాక జాగ్రత్తగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.