ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఆలూ పరోట ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఆలూ పరోట మీ సొంతం.
ఆలూ పరోట కి కావలసిన పదార్ధాలు:
ఆలుగడ్డలు -1 /2 కేజీ
గోధుమపిండి - 1/2 కేజీ
గరం మసాల - 1/4 స్పూన్
కొత్తిమీర తురుము - 1 కప్పు
ఉప్పు -సరిపడ
నూనె -సరిపడ
కారం- 1/2 స్పూన్
పసుపు -కొంచం
ఆలూ పరోట తయారు చేసే విధానం:
ముందుగ గోధుమపిండిని ఉప్పు, కొంచం నూనె వేసి గట్టిగ కలుపుకోవాలి. తరువాత ఆలుగడ్డలు చెక్కు తీసి పెద్ద ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఉడికించిన ఆలుగడ్డలను చిదిమి నూనెలో వేయంచాలి. ఐదు నిమిషాల తరువాత అందులో గరం మసాల, కొత్తిమీర తురుము, కారం, పసుపు, మరియు కొంచం ఉప్పు వేసి బాగా కలిపి దింపుకోవాలి.
తరువాత నానబెట్టుకున్న పిండిని చిన్న ఉండల చేసుకొని కొద్దిగా వత్తి మద్యలో ఆలుగడ్డ కూరను పెట్టి నాలుగు వైపులా మూసి చపాతి లాగ పలచగా చేసుకొని పెనం పై నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. మిగత పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి. వీటిని పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి.