Home » Telugu Recipes » Homemade ఆలూ గోబీ కూర cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

ఆలూ గోబీ కూర


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఆలూ గోబీ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఆలూ గోబీ కూర మీ సొంతం.

ఆలూ గోబీ కూర కి కావలసిన పదార్ధాలు:

ఆలూ గడ్డలు - 1/2 కేజీ
గోబీ ముక్కలు - 2 కప్పులు
జీలకర్ర - 1 స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
నూనె - సరిపడ
కారం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడ
ఇంగువ - చిటికెడు
ధనియాలపొడి - 1 స్పూన్
గరంమసాల - 1/2 స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ -1/2 స్పూన్
పసుపు -1/2 స్పూన్

ఆలూ గోబీ కూర తయారు చేసే విధానం:

ముందుగ నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి ఆలు గడ్డలని ఉడికించి పెట్టుకోవాలి. తరువాత మరో గిన్నెలోకి నీళ్ళు తీసుకోని అందులో ఉప్పు, కొంచం పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసి పది నిమిషాలు మరిగించుకొని దింపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి వేడయ్యాక అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాలపొడి, కారం, పసుపు వేసుకొని కొద్ది సేపు వేయించాలి. తరువాత అందులోనే కాలీఫ్లవర్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 5 నిమిషాలపాటు చిన్న మంట పై మగ్గించాలి.
ఆ తరువాత ఆలూ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా నీళ్ళు చల్లి కలిపి మూతపెట్టి మరో పది నిమిషాలు ఉడికించాలి. మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఆపై గరంమసాలా, ఆమ్‌చూర్ పౌడర్‌ని కూడా వేసి కలియబెట్టి మూతలేకుండా మరో రెండు నిమిషాలు ఉడికించి. చివర్లో కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి. అంతే వేడి వేడి ఆలూ గోబీ కూర తయార్.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com