ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఆలుగడ్డ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఆలుగడ్డ వేపుడు మీ సొంతం.
ఆలుగడ్డ వేపుడు కి కావలసిన పదార్ధాలు:
ఆలుగడ్డలు -1 కేజీ
నూనె - 3 స్పూన్స్
కారం - 2 స్పూన్స్
పసుపు -1/2 స్పూన్
పోపుగింజలు -1 స్పూన్
వెల్లుల్లి - 4
కరివేపాకు - కొంచం
ఉప్పు - సరిపడ
ఆలుగడ్డ వేపుడు తయారు చేసే విధానం:
ముందుగ ఆలుగడ్డలు కడిగి చెక్కు తిసి సన్న ముక్కలుగా కట్ చేయాలి.
ఇప్పుడు కడాయిలో నూనె వేసి కాగిన తరువాత పోపుగింజలు, వెల్లుల్లి, కరివేపాకు వేగిన తరువాత
ఆలుగడ్డ ముక్కలు వేసి మూత పెట్టి సన్నని మంటపై మగ్గనివ్వాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు
వేసి బాగా కలిపి దింపుకోవాలి.