ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఆలుగడ్డ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఆలుగడ్డ కుర్మా మీ సొంతం.
ఆలుగడ్డ కుర్మా కి కావలసిన పదార్ధాలు:
ఆలుగడ్డలు -1/2 కేజీ
ఉల్లిపాయ-1
టొమాటో -1
పచ్చిమిర్చి -3
కొబ్బరి - 100 గ్రా
ధనియాలు - 3స్పూన్స్
గరంమసాల -1/2 స్పూన్
కారం - 1 స్పూన్
పసుపు -1/2 స్పూన్
అల్లం,వెల్లుల్లి పేస్టు- 1/2 స్పూన్
ఆవాలు, జీలకర్ర - 1/2 స్పూన్
ఉప్పు -సరిపడ
నూనె-3 స్పూన్స్
ఆలుగడ్డ కుర్మా తయారు చేసే విధానం:
ముందుగ ఆలుగడ్డలను పెద్ద ముక్కలుగ కోసి ఉడికించుకోవాలి. తరువాత ధనియాలు, కొబ్బరి, గరం మసాలను నీళ్ళు కలిపి
మెత్తగా ముద్దలాగా చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపుగింజలు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాక టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం,వెల్లుల్లి పేస్టు వేసి బాగా మగ్గించాలి.
తరువాత మసాల ముద్ద వేసి మూత పెట్టి ఐదు నిముషాలు ఉంచాలి, ఇప్పుడు సరిపడ నీళ్ళు పోసి చెక్కు తీసిన ఆలుగడ్డ ముక్కలు, కారం, పసుపు, సరిపడ ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు ఉడికించాలి. పులుసు దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి. దీనిని చపాతీ తో కానీ అన్నముతో కానీ తీసుకోవచ్చు.