ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఆనియన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఆనియన్ సూప్ మీ సొంతం.
ఆనియన్ సూప్ కి కావలసిన పదార్ధాలు:
ఉల్లిపాయలు - 4
సూప్ క్యూబ్స్ -2
బ్రెడ్ ముక్కలు - 8
ఉప్పు, నూనె - సరిపడ
వెన్న - 1 స్పూన్
మిరియాల పొడి - కొద్దిగ
నీళ్ళు - 3 కప్పులు
ఆనియన్ సూప్ తయారు చేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని. స్టవ్ మీద బాణలి పెట్టి. అందులో కొద్దిగా నూనె, వెన్న వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు అందులో నీళ్ళు, సూప్ క్యూబ్స్ వేసి బాగా ఉడికించాలి.
తరువాత ఈ సూప్ లో ఉప్పు, మిరియాల పొడి కలిపి ఎర్రగా వేయించిన బ్రెడ్ ముక్కల పై వెన్నరాసి సూప్ లోవేసి సర్వ్ చేయాలి. ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే ఆనియన్ సూప్ రెడీ.