Home » Telugu Recipes » Homemade అవియల్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

అవియల్


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం అవియల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే అవియల్ మీ సొంతం.

అవియల్ కి కావలసిన పదార్ధాలు:

క్యారెట్ ముక్కలు - అరకప్పు
మునక్కాయ - 1
ఉల్లిపాయ -1
దోసకాయ ముక్కలు - అరకప్పు
సొరకాయ ముక్కలు - అరకప్పు
క్యాప్స్ కమ్ ముక్కలు - అరకప్పు
కొబ్బరికాయ - 1
నెయ్యి - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
సెనగపప్పు - 1స్పూన్
మినపప్పు - 1స్పూన్
ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర -సరిపడ
పసుపు - సరిపడ

అవియల్ తయారు చేసే విధానం:

ముందుగా కొబ్బరి తురుముకోవాలి. మినపప్పు, సెనగపప్పు బాణలిలో వేయించాలి. ఇవి చల్లారిన తరువాత ఇంగువ, పచ్చిమిర్చి, చేర్చి మెత్తగా రుబ్బాలి.
బాణలిలో నెయ్యి వేసి సెనగాప్పు ముద్దను వేసి వేయించాలి. అది మంచి వాసన వస్తుండగా పసుపు, కొబ్బరి తురుము వేసి తక్కువ మంట మీద వేయించాలి తరువాత అన్ని కూరగాయల ముక్కలు వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత కొత్తిమీర చేర్చి దింపుకోవాలి.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com