ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం అరటికాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే అరటికాయ వేపుడు మీ సొంతం.
అరటికాయ వేపుడు కి కావలసిన పదార్ధాలు:
పచ్చిఅరటికాయ- 1
మిరియాల పొడి - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
కారం -1/2 స్పూన్
పసుపు - 1/4 స్పూన్
ఉల్లిపాయ- 1
ఆవాలు - 1/2 స్పూన్
కరివేపాకు - సరిపడ
ఉప్పు - సరిపడ
నూనె - సరిపడ
అరటికాయ వేపుడు తయారు చేసే విధానం:
ముందుగా పచ్చిఅరటికాయకు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలలో కొద్దిగా నీళ్ళు పోసి ఉప్పు వేసి 5నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అరటికాయ ముక్కలు వేసి మూత పెట్టి ఐదు నిముషాలు వేయించాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, మిరియాల పొడి వేసి కలిపి దించాలి. అంతే రుచికరమైన పచ్చిఅరటికాయ ఫ్రై రెడీ.